ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: ప్రత్యేక లోక్‌అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి అనూష అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్‌పై బార్ అసోసియేషన్ సభ్యులతో సమన్వయ సమీక్ష నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులు గుర్తించాలని సూచించారు. కోర్టు ఖర్చులు లేకుండా తక్కువ సమయంలో తుది పరిష్కారం చూపే లోక్ అ దాలత్ సేవలు వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీశ్‌బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. గ్రామస్తులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.


