చట్టాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: వివిధ కారణాలతో జైలు లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి జి.అనూష అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో ని స్పెషల్‌ సబ్‌ జైలును సందర్శించారు. రిమాండ్‌, ట్రయల్‌ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం, చట్టపరమైన హక్కులపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సొంత న్యాయవాదులను నియమించుకోలేని రి మాండ్‌ ఖైదీలకు ఉచిత రక్షణ న్యాయవాది, జిల్లా అటార్నీ సేవా హక్కులను కేటాయిస్తార ని తెలిపారు. ఉచిత న్యాయ సహాయ పథకా లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జైలు కమ్మీలు, వంటగది పరిశుభ్రతను తనిఖీ చేశారు. ఆహారం, వైద్య సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశా రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement