ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పీఎం రాహత్ పథకం అమలుపై డీఎంహెచ్‌వో నాగేంద్ర మంగళవారం అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో బాధితులకు తక్షణ వైద్య సహాయం, ప్రాణా లు కాపాడేందుకు మొదటి గంటలో అవసరమైన చికిత్స అందించడం, అర్హులకు నగదు రహిత వైద్య సేవలు కల్పించడం తదితర అంశాల గురించి వివరించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ సత్యనారాయణ, ఎన్‌ఐసీ డీఆర్‌ఎం లక్ష్మణ్, టీమ్ లీడర్ గణేష్, మాస్ మీడియా అధికారి మార్త, జూనియర్ అసిస్టెంట్ పృథ్వీ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


