వాంకిడి: జలసిరి పనులతో భూగర్భ జలాలు పెరుగుతాయని జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఖిరిడి గ్రామ పంచాయతీ పరిధిలో వీబీ జీ రామ్‌జీ పథకం కింద నిర్మించిన ఫామ్‌పాండ్‌లను మంగళవారం పరిశీలించారు. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపు, పంటలకు నీటి వినియోగం వంటి అంశాలను రైతులకు వివరించారు. ఎంపీడీవో కార్యాలయంలో జలసిరిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫామ్‌పాండ్‌లు, పెర్కులేషన్ ట్యాంకుల నిర్మాణాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న, ఎంపీవో జావిద్, ఏపీవో శ్రావణ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


