● ఆగస్టు నుంచి ఇప్పటివరకు 3,086 అర్జీలు ● సమస్యల పరిష్కారం కోసం బాధితుల నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

● ఆగస్టు నుంచి ఇప్పటివరకు 3,086 అర్జీలు ● సమస్యల పరిష్కారం కోసం బాధితుల నిరీక్షణ

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

● ఆగస్టు నుంచి ఇప్పటివరకు 3,086 అర్జీలు ● సమస్యల పరిష్కారం కోసం బాధితుల నిరీక్షణ

బెజ్జూర్‌: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రజల అర్జీలు స్వీకరిస్తున్నా.. వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ప్రజలకు దూరభారం తగ్గించాలనే ఉద్దేశంతో ఆగస్టు 17 నుంచి మండలస్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 3,086 దరఖాస్తులు వస్తే.. ఇందులో మండల స్థాయిలో 1,230 అర్జీలు అందాయి.

పరిష్కారమేది..?

ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నా పరిష్కారంపై దృష్టి సారించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆగస్టు నుంచి ఇప్పటివరకు 3,086 దరఖాస్తులు రాగా, ఇందులో ఎన్ని పరిష్కరించారు..? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి..? ఎన్ని తిరస్కరించారు..? అనే వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. కేవలం దరఖాస్తులను స్వీకరించి వదిలేయకుండా, ప్రతీస్థాయిలో పరిష్కార గడువు విధించి, నిరంతరం పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

ఐదు దరఖాస్తులు ఇచ్చినా..

ఇప్పటివరకు పలు సమస్యలపై మొత్తం ఐదు దరఖాస్తులు ఇచ్చినా ఒకటి కూడా పరిష్కారం కాలేదు. సామాన్యులు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగా ల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంబంధిత అధికారులు అర్జీలు పెండింగ్‌ ఉంచొద్దు.

– గుమ్ముల శ్రీనివాస్‌, బెజ్జూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement