వరుస ఘటనల నేపథ్యంలో.. | - | Sakshi
Sakshi News home page

వరుస ఘటనల నేపథ్యంలో..

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అక్టోబర్‌ 28న పట్టణంలోని లారీ నుంచి డీజిల్‌ లీకై రోడ్డుపై పడటంతో సుమారు 35 నుంచి 40 మంది వాహనదారులు అదుపుతప్పి జారిపడి గాయపడ్డారు. అంతకు ముందు అక్టోబర్‌ 19న మిల్లు పార్కింగ్‌ ప్రదేశంలో కర్ర లారీ టైరు తలపై ఎక్కడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అదే రోజు ‘పొంచి ఉన్న ప్రమాదం– కర్ర లారీల రాకపోకలపై ప్రజల ఆందోళన’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని సైతం ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. లారీలు రోడ్డు ప్రయాణానికి అనువైన స్థితిలో ఉండాలని, డిజిల్‌ ట్యాంకుల్లో లీకేజీలు లేకుండా చూసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు, వేగ పరిమితులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు డీజిల్‌, ఇతర పదార్థాలు రోడ్డుపై పడితే వెంటనే శుభ్రం చేయించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement