కౌటాల: జిల్లాలోని రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి అన్నా రు. కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స మస్యలున్న రైతులు దరఖాస్తులు చేసుకోవా లని, అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో సమాచారంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ప్రజాసేతు యాప్‌ను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటి వద్ద నుంచే క్యూఆర్ కోడ్‌తో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం దరఖా స్తులు పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


