ఆసిఫాబాద్‌అర్బన్: కనీస వేతనంగా రూ.18 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించా లని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం ఆశవర్కర్లు సమ్మె నోటీసు అందించారు. సీఐ టీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడు తూ ప్రభుత్వం ఆశవర్కర్లతో వెట్టిచాకిరీ చే యించుకుంటూ ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమవుతుందన్నారు. తగిన గుర్తింపు, గౌరవం, వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 15 నుంచి చేపట్టే నిరవధిక సమ్మెలో జిల్లాలోని ఆశవర్కర్లు అధి క సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశ వర్క ర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూ ప, నాయకులు నవీన, కవిత, లలిత, నిర్మల, అర్చన, వాణి తదితరులు పాల్గొన్నారు.


