ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని వినతి | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని వినతి

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆసిఫాబాద్‌ సెగ్మెంట్‌ పరి ధిలో పనిచేస్తున్న మిషన్‌ భగీరథ కార్మికులకు ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం వేతనాలు చెల్లించకుండా వారి శ్రమను దోచుకుంటున్న ఐదు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం జిల్లా కేంద్రంలోని డివిజన్‌ కార్యాలయంలో డీఈ పృథ్వీరాజ్‌కు వినతిపత్రం అందించా రు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ మాట్లాడుతూ పదేళ్ల నుంచి తక్కు వ వేతనాలు చెల్లిస్తున్న ఏజెన్సీలను తక్షణమే బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని పలు మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చర్యలు తీసుకోకపోతే ఆందో ళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మకూరి చిరంజీవి, జయకృష్ణ, షబాజ్‌, రాజేశ్వర్‌, వేణు, శ్రీకాంత్‌, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement