ఉత్పత్తి, రక్షణలో ‘ఖైరిగూర’ ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తి, రక్షణలో ‘ఖైరిగూర’ ఆదర్శం

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

రెబ్బెన: బొగ్గు ఉత్పత్తి, రక్షణలో ఖైరిగూర ఓసీపీ ఆదర్శంగా నిలుస్తోందని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్‌ అన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖైరిగూర ఓసీపీ జాతీయ స్థాయిలో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన నేపథ్యంలో శుక్రవారం ఓసీపీపై సంబురాలు నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణ హిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాల్లో జాతీయ స్థాయిలో 100 మార్కులకు 91కి పైగా మార్కులతో ఖైరిగూర ఓసీపీ ఉత్తమంగా నిలిచిందన్నారు. అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పనిచేస్తుండడంతోనే 5 స్టార్‌ రేటింగ్‌ సాధ్యమైందన్నారు. అనంతరం అత్యవసర సమయంలో సీపీఆర్‌ చేసే విధానంపై రెస్క్యూ సిబ్బంది అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి, ప్రాజెక్టు అధికారి ఎం.నరేందర్‌, ఎస్వోటూ జీఎం స్వామిరాజు, ఏరియా ఇంజినీర్‌ వీరన్న, ప్రాజెక్టు మేనేజర్‌ శంకర్‌, ఫిట్‌ కార్యదర్శి మారం శ్రీనివాస్‌, ఇన్‌చార్జి పీఈ ఎస్‌.రాజు, సేఫ్టీ అధికారి గౌతమ్‌ రాజేష్‌ రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement