రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బెల్లంపల్లి బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) పాఠశాల/కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఎస్జీఎఫ్‌ ఆధ్వర్యంలో అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నారు. గతనెల 1న బెల్లంపల్లి కేంద్రంగా జరిగిన జోనల్‌స్థాయి పోటీల్లో బి.వినయ్‌ కుమార్‌, ఆర్‌.ప్రణవ్‌ (ఎంపీసీ, సెకండియర్‌), టి.రాజేష్‌, వి.విగ్నేష్‌ (బైపీసీ), కె.సిద్ధార్థ (ఎంపీసీ, ఫస్టియర్‌)లు ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్‌ ఆకిడి విజయ్‌సాగర్‌ తెలిపారు. సికింద్రాబాద్‌లో ఈనెల 6 నుంచి 8వ తేది వరకు జరిగే రాష్ట్రస్థాయిపోటీల్లో వీరు పాల్గొనున్నారు. గురువారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు అభినందించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ తన్నీరు గోపి ఉపాధ్యాయులు కమలాకర్‌, మల్లికార్జున్‌, అఖిల్‌, జ్యోతి, శివ తేజస్విని, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్‌, ముచ్చకుర్తి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement