మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతర్ క్రికెట్ పోటీల్లో సీవీరామన్ డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. గురువారం స్థానిక సీవిరామన్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కేయూ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలల క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఉత్కంఠ సా గిన పోటీల్లో సీవీరామన్ డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలవగా మిమ్స్ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్పొరేటర్ వెంకటేశ్వరావు, సీవీరామన్ కళాశాల పిన్సిపాల్ నర్సయ్య, డిగ్రీ కళాశాల యాజమాన్య సంఘం అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.


