కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని కోసిని, చింతగూడ, కోయవాగు గ్రామాల ప్రజలకు తహసీల్దార్ గురువారం నోటీసులు జారీ చేశారు. సర్‌సిల్క్ మిల్లుకు సంబంధించిన భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారు ఏడురోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశంతో భయాందోళనకు గురవుతున్నారు. ఏళ్లుగా సర్‌సిల్క్ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న తమను ఒక్కసారిగా మమ్మల్ని ఆక్రమణదారులు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని లేకపోతే బలవంతంగా తొలగిస్తామని అధి కారులు చెప్పడంతో గ్రా మస్తులు ఏం చేయాలో చర్చించుకుంటున్నారు.


