విద్యుత్‌ షాక్‌తో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో ఒకరి మృతి

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

● గోదావరిలో మునిగి ఒకరి మృతి

భీమారం: విద్యుత్‌ షాక్‌తో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై రాజేందర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రంలోని మైసమ్మవాడకి చెందిన మంచాల మల్లేశ్‌ (45) బుధవారం అర్ధరాత్రి పత్తి చేను వద్ద కాపలా ఉన్నాడు. అక్కడ విద్యుత్‌ తీగకు తగలి అక్కడిక్కడే మృతిచెందాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. భార్య భారతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాముకాటుతో రైతు మృతి

లక్సెట్టిపేట: రైతు పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన మండె పోచయ్య(46) తనకు ఉన్న ఎకరంలో వరి సాగు చేసుకుంటున్నాడు. రోజు మాదిరిగా గురువారం ఉదయం నీరు పెట్టేందుకు వెళ్లగా పాముకాటేసంది. గమనించిన స్థానికులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్సపొందుతు మృతి చెందాడు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

దైవదర్శనానికి వచ్చి

కానరాని లోకాలకు..

దండేపల్లి: మహారాష్ట్ర నుంచి దైవదర్శనానికి వచ్చిన భక్తుడు గోదావరిలో నీటి మునిగి మృతిచెందాడు. దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి నది వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా రాజూరా తాలూక గెర్రిగూడకు చెందిన పెందూర్‌ దివాకర్‌ (24) దండారీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పద్మల్‌పురి కాకో ఆలయానికి వచ్చారు. గురువారం మధ్యాహ్నం గోదావరి నదిలో స్నానానికి దిగాడు. ఈత రాక నీట మునిగాడు. గమనించిన పలువురు భక్తులు అతన్ని బయటకు తీశారు. అక్కడేఉన్న పోలీసులు సీపీఆర్‌ చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య స్నేహ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజవర్ధన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement