● ఒక్కటైన ప్రేమజంట
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన అక్షర, మహేందర్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయమై మహేందర్ పట్టించుకోకపోవడంతో, న్యాయం కోసం అక్షర మూడురోజుల పాటు అతని ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసుల కౌన్సెలింగ్, పెద్ద మనుషులు ఇరు కుటుంబాలవారికి నచ్చజెప్పారు. ఎట్టకేలకు ప్రేమజంటకు గురువారం కన్నెపల్లిలోని సదానందర హరి ఆలయంలో పెళ్లి జరిపించి ఒక్కటి చేశారు. దీంతో వారి ప్రేమకథ సుఖాంతమైంది.
తక్కువ ధరకు బస్సుల అద్దె
మంచిర్యాలఅర్బన్: కార్తీకమాసం పురస్కరించుకు ని ఈనెలలో శుభకార్యాలు, పర్యాటక స్థలాలు, టూ ర్లు, ఆలయాల సందర్శనకు వెళ్లే భక్తులు, ప్రజల కో సం బస్సులు తక్కువ ధరకు అద్దెకు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ నరేశ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపా రు.ఆర్డినరీ,ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జ రీ, రాజధాని, లహరి ఏసీ బస్సులను కేటగిరీల వారీగా, గంటల ప్రాతిపదికన తక్కువ ధరకు అద్దె ప్రాతిపదికన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 9959 226004, 9063414569లో సంప్రదించాలని సూచించారు.


