ఆసిఫాబాద్‌రూరల్: భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల ని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా అధికా రులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇండియా విభిన్న భా షలు, విభిన్న సంస్కృతులు కలిగిన దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, ఐక్యతకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. జిల్లా అటవీశాఖ కా ర్యాలయ ఆవరణలో ఉద్యోగులతో డీఎఫ్‌వో బాలా మణి ఆధ్వర్యంలో అటవీ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ అధ్యక్షతన ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి వేణు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉపకరణాలు వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని దివ్యాంగులు ఉచిత సహాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవా లని కలెక్టర్ హరిత సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాగజ్‌నగర్ సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జైపూర్ ఫుట్ క్యాంపు ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమైన దివ్యాంగులు కృత్రిమ కాళ్లు, కృత్రిమ చేతులు, ఊత కర్రలు, నడక సహా యకాలు, ఆర్థోపెడిక్ బూట్లు, సహాయ బెల్టులు, వి నికిడి పరికరాలు, ఇతర సహాయ పరికరణాలు తీ సుకోవాలని సూచించారు. సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ ప్రతినిధులు, సంబంధిత అధికారులున్నారు.


