ఆసిఫాబాద్‌అర్బన్: ‘ఓట్ బచావో– దేశ్ బచావో’ మెగా ర్యాలీ పాల్గొనేందుకు జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బస్సును డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఓటుహక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువ సంరక్షణ లక్ష్యంగా ఆదివారం ఢిల్లీలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు రాపర్తి మురళి, ఇమ్రాన్, కళావతి తదితరులు పాల్గొన్నారు.


