ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శుక్రవారం అండర్–18 బాలబాలికల జిల్లాస్థాయి టెన్నికాయిట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. మొత్తం 30 మంది క్రీడాకారులు హాజరు కాగా, ప్రతిభ చూపిన ఎనిమిది మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ తెలిపారు. నవంబర్ 1న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో రవీందర్, మణిదీప్, సందీప్, సాగర్తో పాటు గాయత్రి, సంజన, అన్నపూర్ణ, సాయిమేఘన పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, మల్లేశ్, పీడీలు, పీఈటీలు తిరుపతి, రవి, సువర్ణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


