నేల సంరక్షణ రైతుల బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నేల సంరక్షణ రైతుల బాధ్యత

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: సాగునేల సంరక్షణకు రైతుల బాధ్యత అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకట్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘ఖేత్‌ బచావో అభియాన్‌’కు హాజరై మాట్లాడారు. రైతులు సహజ వ్యవసాయ, సేంద్రియ పద్ధతులు పాటించాలన్నారు. కోతల అనంతరం వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. పత్తి కట్టెను తగలబెట్టకుండా ముక్కలుగా చేసి చేలలో కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు మిలింద్‌కుమార్‌, ఏఈవోలు ముత్యం తిరుపతి, చిరంజీవి, రాము, హరీశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement