దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

చింతలలమానెపల్లి: భూ సమస్యలు, భూభా రతి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం భూభా రతి, రెవెన్యూ సదస్సు దరఖాస్తులను పరిశీ లించారు. మండలంలో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో స్వయంగా పరిశీలన చేపట్టారు. రాత్రి 8గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు. అధికారులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిష్కరించగలిగిన వాటిని సైతం పెండింగ్‌లో ఉంచడం సరికాదన్నారు. భూములకు సంబంధించిన విషయాలు ప్రజలకు కీలకమైనవని అధికారులు జాప్యం చేయొద్దని సూచించారు. తహసీల్దార్‌ గొడం ప్రకాశ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మడావి దౌలత్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement