అక్టోబర్‌లో అడుగంటి.. | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో అడుగంటి..

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

ప్రవాహం లేని పారిగాం వాగు

కళ తప్పిన ముత్తంపేట వాగు

పూర్తిగా ఎండిపోయిన టోంకిని వాగు

అడుగంటిన పెద్దవాగు

వర్షాభావ పరిస్థితులతో వేసవికి ముందే నీటి వనరులు ఎండిపోతున్నాయి. ఏటా సంక్రాంతి వరకు వరదతో ఉండే వాగులు కళ తప్పుతున్నాయి. కౌటాల, సిర్పూర్‌(టి) మండలాల పరిధిలోని పెద్దవాగు, టోంకిని, పారిగాం, ముత్తంపేట వాగుల్లో నీటి ప్రవాహం అక్టోబర్‌లోనే అడుగంటిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రానున్న వేసవిలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారే అవకాశం ఉందని భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా గుర్తించి, అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు. – కౌటాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement