అడవుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం తుడుందెబ్బ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీశాఖ నిబంధనలు, ఆదివాసీల హక్కులు, ఎదురవుతున్న సమస్యలు, అటవీ సంరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. తుడుందెబ్బ నాయకులు పలు కీలక అంశాలను డీఎఫ్‌వో దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు 1/70 చట్టం, పెసా చట్టాలను గుర్తించాలని, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా సీ సీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను నిబంధనల పేరుతో అడ్డుకోవద్దని కోరారు. ఆదివాసీలకు అన్యాయం జరగనంతవరకు అటవీశాఖ అధికారులకు తుడుందెబ్బ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. పర్యావరణం, అడవులను కాపాడటంలో ఆదివాసీలు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎఫ్‌వో సూచించారు. సమావేశంలో తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌, జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్‌, నాయకులు ప్రభాకర్‌, మా రుతి, రాంశావ్‌, భగవంత్‌రావు, నాగోరావు, ప్రకాశ్‌, పురుషోత్తం, వినేష్‌, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement