పక్కాగా ‘యూడైస్‌ ప్లస్‌’! | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ‘యూడైస్‌ ప్లస్‌’!

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

● విద్యార్థుల వివరాలు సరిదిద్దేందుకు అవకాశం ● రేపటి వరకు గడువు

కెరమెరి: విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు పక్కాగా రూపొందించాలంటే పాఠశాలల్లో వారి సమగ్ర వివరాలు ఉండాలి. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? ఏయే తరగతుల్లో ఎందరు ఉన్నారు? పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు ఏంటి..? తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం ఉంటేనే విద్యావ్యవస్థను బ లోపేతం చేసేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసే యూడైస్‌ ప్లస్‌ వివరాలపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థుల సమాచా రంలో తప్పులు సరిదిద్దుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించింది. జిల్లాలోని ప్రధానో పాధ్యాయులు, సంబంధిత అధికారులు అప్రమత్త మై వివరాలను మరోసారి పరిశీలిస్తున్నారు.

1,209 పాఠశాలలు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు తదితర యాజమాన్యాలకు చెందిన 1,262 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1,02,632 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కీలకమైన ప్రక్రియ. విద్యార్థుల వివరాల నుంచి స్కూళ్లకు చెందిన సమాచారం వరకు ప్రతీ అంశం సక్రమంగా ఉండాలి. ఇప్పటికే నమోదైన వివరాలను పాఠశాలల రికార్డులతో సరిపోల్చుకోవాల్సిన ఉంటుంది. జిల్లాలోని సగం పాఠశాలల్లో 10 నుంచి 15 మంది విద్యార్థుల వివరాలను సవరణ చేయాల్సి ఉంటుంది.

నమోదు చేసే సమయంలో..

యూడైస్‌ ప్లస్‌లో విద్యార్థులకు సంబంధించిన వివరాలు నమోదు చేసే సమయంలో అక్షర దోషాలు, సమాచారంలో తేడాలు, తరగతులు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పాఠశాలల వివరాల్లోనూ తప్పులు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. ఇందుకోసం సంబంధిత రికార్డులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదైన సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి. విద్యార్థుల సంఖ్య, పాఠశాల వివరాల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా చూడాలి. ఒకసారి నమోదు చేసిన వివరాలను పదేపదే పరిశీలించకుండా వదిలేస్తే తప్పులు అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకే సవరణలకు ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలి.

విద్యాప్రమాణాలకు కీలకం

యూడైస్‌ ప్లస్‌ ద్వారా సేకరించిన సమాచారం విద్యాశాఖకు పాఠశాలల పరిస్థితిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల సంఖ్య, పాఠశాలల నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలకు సంబంధించిన గణంకాలు విద్యా ప్రణాళికల రూపకల్పనలో ప్రాధాన్యం కలిగి ఉంటాయి. సమాచారం కచ్చితంగా ఉంటే అవసరాలను గుర్తించడం, వనరుల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. ఈ నేపథ్యంలో పాఠశాలల నుంచి అందే వివరాల్లో తప్పులు లేకుండా చూడడం అత్యంత ప్రధానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement