సహ చట్టం సెక్షన్లపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సహ చట్టం సెక్షన్లపై అవగాహన అవసరం

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

● రాష్ట్ర సహ చట్టం ప్రధాన కమిషనర్‌ జి.చంద్రశేఖర్‌రెడ్డి

ఆసిఫాబాద్‌అర్బన్‌: సహ చట్టంలోని ప్రతీ సెక్షన్‌పై ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజాసమాచార అధికారులు, అప్పిలేట్‌ అధికారులకు పూర్తి అవగాహన అవసరమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌ డా.జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్‌రావు, మోసిన పర్వీన్‌, దేశాల భూపాల్‌, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి మెర్ల, కలెక్టర్‌ కె.హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ అంశంపై అవగాహన ఉన్నప్పుడే ఆర్‌టీఐ దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం పూర్తి పారదర్శకంగా, సరళీకృతంగా ఉండేలా చూడాలన్నారు. ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ఇవ్వాల్సిన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దన్నారు. ప్రపంచంలో 132 దేశాల్లో సహ చట్టం పకడ్బందీగా అమలవుతుందని పేర్కొన్నారు. సంస్థ విధులు, బాధ్యతలు అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు, నిర్ణయ ప్రక్రియ, పర్యవేక్షణ, జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. కలెక్టర్‌ కె.హరిత మాట్లాడుతూ సహ చట్టం కమిషనర్ల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని అప్పిలేట్‌ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు సెక్షన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. దరఖాస్తుదారులు, పౌరులకు సకాలంలో సమాచారం అందించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించడం, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement