ఓటుహక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఓటుహక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

● ఏఐసీసీ పర్యవేక్షకుడు మరియప్పన్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఓటుహక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నవంబర్‌ 1న ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఓట్‌ బచావో– దేశ్‌ బచావో కార్యక్రమం చేపడుతున్నట్లు ఏఐసీసీ పర్యవేక్షక్షుడు మరియప్పన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి కోర్డినేటర్‌ శ్రావణ్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో నిర్వహించే ఓట్‌ బచావో– దేశ్‌ బచావో కార్యక్రమం ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ దండె విఠల్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఓటరు జాబితాలో అక్రమాలు, అవకతవకలు జరగకుండా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవంబర్‌ 1న తేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, కాగజ్‌నగర్‌ మార్కెట్‌ చైర్మన్‌ దేవయ్య, నాయకులు గణపతి, బాలేష్‌గౌడ్‌, రాపర్తి మురళి, ఇమ్రాన్‌, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement