రోడ్డుపై డీజిల్‌.. జారిపడ్డ వాహనదారులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై డీజిల్‌.. జారిపడ్డ వాహనదారులు

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లుకు సోమవారం లోడ్‌ నిమిత్తం వచ్చిన ఓ లారీ ఈఎస్‌ఐ మూలమలుపు వద్ద ఉన్న డివైడర్‌కు తగలడంతో దాపి డీజిల్‌ ట్యాంక్‌ పగిలిపోయింది. ఈఎస్‌ఐ మూలమలుపు నుంచి లారీ చౌరస్తా వరకు బీటీరోడ్డుపై ఇంధనమంతా పడిపోయింది. ఈ విష యం తెలియక ద్విచక్ర వాహనదారులు పలువురు అదుపుతప్పి రోడ్డుపై కింద పడగా గాయాలపాలయ్యారు. కొందరు స్థానికులు గమనించి రాకపోకలను మళ్లించారు. అయితే లారీ ట్యాంక్‌ పగిలి డీజిల్‌ రోడ్డుపై పారుతున్నా సంబంధిత డ్రైవర్‌ పట్టించుకోకుండా వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. మున్సిపల్‌, పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం ఇసుక కూడా చల్లలేదని, భారీ ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement