రసవత్తరంగా ‘పీఎంశ్రీ’ జిల్లాస్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా ‘పీఎంశ్రీ’ జిల్లాస్థాయి పోటీలు

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో బుధవారం 18 పీఎం పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీలు రసవత్తరంగా సాగాయి. డీఈవో సచ్చిదానంద చారి మాట్లాడుతూ ఆటలతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. కాగా, బాలుర విభాగంలో కబడ్డీలో బాబాపూర్‌, ఖోఖోలో తెలంగాణ మోడల్‌ స్కూల్‌, వాలీబాల్‌ పోటీల్లో సిర్పూర్‌ (యు) జట్లు విజేతలుగా నిలిచాయి. బాలి కల విభాగంలో ఖోఖోలో గిరిజన బాలికల పాఠశాల, కబడ్డీలో సిర్పూర్‌(టి) జట్లు మొద టి బహుమతులు కైవసం చేసుకున్నాయి. ఎస్‌జీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోన్‌రావు, ఎస్‌వో శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌, పీడీలు, పీఈటీలు తిరుపతి, రమేశ్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement