బెజ్జూర్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా సీనియర్ జడ్జి అనూష అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించా లన్నారు. హక్కులు తెలుసుకోవడంతోపాటు విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించా రు. విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇబ్బందులకు గురి చేస్తే భయపడకుండా షీటీమ్స్‌ను ఆశ్రయించాలని సూచించారు. అలాగే 15100, 1098 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని, ఆహారా న్ని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.మారుబాయి, బెజ్జూర్ ఎస్సై కె.రమేశ్, టీచర్లు పాల్గొన్నారు.


