వెరిఫికేషన్‌కు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

వెరిఫికేషన్‌కు వేళాయె!

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● అంగన్‌వాడీ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు ● నవంబర్‌ 4 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ● ఆసిఫాబాద్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆసిఫాబాద్‌ మండలంలో నవంబర్‌ 4, 5 తేదీల్లో వెరిఫికేషన్‌ నిర్వహించనుండగా, రెబ్బెన మండలంలో 6న, తిర్యాణి మండలంలో 7న నిర్వహిస్తారు. ● జైనూర్‌ ప్రాజెక్టు పరిధిలోని జైనూర్‌ మండలంలో 4, 5 తేదీల్లో, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల్లో 6, 7 తేదీల్లో పత్రాల పరిశీలన కొనసాగుతుంది. ● కాగజ్‌నగర్‌ ప్రాజెక్టు పరిధిలోని కాగజ్‌నగర్‌ మండలంలో 4, 5 తేదీల్లో, దహెగాం మండలంలో 6, 7 తేదీల్లో ప్రక్రియ నిర్వహిస్తారు. ● సిర్పూర్‌(టి) ప్రాజెక్టు పరిధిలోని సిర్పూర్‌(టి), బెజ్జూర్‌ మండలాల్లో 4వ తేదీలో, కౌటాల 5, చింతలమానెపల్లి 6, పెంచికల్‌పేట్‌ 7న కొనసాగుతుంది. ● వాంకిడి ప్రాజెక్టు పరిధిలోని వాంకిడి మండలంలో 4, 5 తేదీల్లో, కెరమెరి 6, 7 తేదీల్లో సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి తెలిపారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లా పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. జిల్లాలో ఆసిఫాబాద్‌, జైనూర్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), వాంకిడి ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల పరిధిలో 153 అంగన్‌వాడీ టీచర్‌, 280 ఆయా పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 9 నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించా రు. గడువు ముగిసిన తర్వాత అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు 2,384 దరఖాస్తులు, ఆయా పోస్టులకు 1470 దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ ఇలా..

కలెక్టర్‌ ఆదేశాల మేరక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. నవంబర్‌ 4 నుంచి 7 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత సీడీపీవో, ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

అందించాల్సిన సర్టిఫికెట్లు ఇవే..

అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రతిని తప్పనిసరిగా తీసుకురావాలి. అలాగే దరఖాస్తులో పేర్కొన్న అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పరిశీలనకు అందించాలి. అలాగే అన్ని ధ్రువపత్రాల రెండు జతల జిరాక్స్‌ కాపీలను గెజిటెడ్‌ అటెస్టేషన్‌తో కార్యాలయాల్లో సమర్పించాలి. విద్యార్హత, వయస్సు, స్థానికత, కులం, ఇతర పత్రాలతో ఆయా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో నిర్ణయించిన తేదీల్లో సంబంధిత సీడీపీవో కార్యాలయంలో హాజరు కావాలి.

జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల ఖాళీలు, దరఖాస్తుల వివరాలు

ప్రాజెక్టు టీచర్‌ పోస్టులు దరఖాస్తులు ఆయా పోస్టులు దరఖాస్తులు

ఆసిఫాబాద్‌ 49 714 75 337

జైనూర్‌ 39 619 124 659

కాగజ్‌నగర్‌ 4 88 7 21

సిర్పూర్‌(టి) 9 270 19 182

వాంకిడి 52 693 55 271

మొత్తం 153 2,384 280 1,470

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement