పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలి

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● సెర్ప్‌ సీఈవో దివ్యదేవరాజన్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ కె.హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, డీఎఫ్‌వో బాలామణితో కలిసి తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం(టీజీఐఎల్‌పీ), వీబీజీ రామ్‌ జీ పథకంలో చేపట్టాల్సిన పనులపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. సెర్ప్‌ సీఈవో మాట్లాడుతూ జిల్లాలోని తిర్యా ణి, లింగాపూర్‌ మండలాల్లో టీజీఐఎల్‌పీ కింద మూడు వేల అత్యంత పేద కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో 1,22,633 జాబ్‌ కార్డులు ఉన్నాయని, వీబీ జీరామ్‌జీ కింద అర్హులైన కుటుంబాలకు 125 రోజులు పని కల్పించాలన్నారు. ఈ ప థకం ద్వారా పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ, మహిళా సమాఖ్య భవనాలు, గిడ్డంగుల నిర్మాణం వంటి 375 రకాల పనులు చేపట్టవచ్చని పేర్కొన్నా రు. జలసిరి పథకం ద్వారా పంట కుంటలు, ఊట కుంటలు, నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నా రు. కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ టీజీఐఎల్‌పీ ప్రా జక్టు, వీబీ జీరామ్‌జీ పథకం పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. పెద్దఎత్తున కూలీలకు పనులు కల్పించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం కమిషనర్‌ను శాలువాతో సన్మానించారు. సమావేశంలో అధికారులు, శిక్షకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement