ఆసిఫాబాద్రూరల్: ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఉమ్మడి జిల్లా జట్టు క్రీడాకారులను మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ కె.హరిత అభినందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులో గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు ఉండటం గర్వకారణమన్నారు. రాను న్న రోజుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాలని, రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీటీడీవో అంబాజీ, నోడల్ అధికారి మీనారెడ్డి, కోచ్ తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.


