ఆదివాసీలు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

తిర్యాణి: ఆదివాసీలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ అన్నారు. తిర్యాణి మండలం సుంగాపూర్‌ పంచాయతీ పరిధిలోని కొలంగూడలోని 55 కుటుంబాలకు గతంలో తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం(టీజీఐఎల్‌పీ)లో భాగంగా వివిధ సామగ్రి అందించగా, మంగళవారం లబ్ధిదారులతో ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పథకం అమలు తీరు, ఎదురువుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. స్వయం ఉపాధి కల్పించేందుకు టీజీఐఎల్‌పీ పథకం రూపొందించినట్లు తెలిపారు. ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవడంతోపాటు జల సంరక్షణకు ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలపై స్థానికులు వినతిపత్రం అందించారు. అలాగే గుడిపేట శివారులో ఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన సోలార్‌ పంప్‌ సెట్‌ను పరిశీలించారు. గిన్నెదరి గ్రామంలో నిర్మించిన మైకెల్‌ యార్క్‌ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. టీజీఐఎల్‌పీ పథకం అమలుపై కోచ్‌లు, అధికారులతో మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో నాగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement