ఆసిఫాబాద్‌అర్బన్: వైద్యరోగ్యశాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌ఎం కింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డిమాండ్లు నెరవేర్చాలని చేపడుతున్న సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌తో కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించగా, తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికై నా మొండి వైఖరి వీడాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.


