అంబులెన్స్‌లో ప్రసవం | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లో ప్రసవం

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

బజార్‌హత్నూర్‌: మండలంలోని మంజరంతండా గ్రామానికి చెందిన గర్భిణి నిస్తే దివ్యకు సోమవారం పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు అందించిన సమాచారంతో అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆమెను బజార్‌హత్నూర్‌ పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువ అయ్యాయి. పైలట్‌ మహేశ్‌ అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. ఈఎంటీ సతీశ్‌ ఈఆర్‌సీపీ డాక్టర్‌ చక్రవర్తిని ఫోన్‌లో సంప్రదించి పురుడుపోయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రిమ్స్‌లో తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement