వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

● ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా కాపాడిన పోలీసులు ● కూతురుకు భారం కాకూడదని బాసరకు చేరిక.. ● కౌన్సెలింగ్‌ చేసి కూతురికి అప్పగింత

బాసర: కూతురు కుటుంబానికి భారం కాకూడదని భావించిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్మల్‌ జిల్లా బాసరకు చేరారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇద్దరి ప్రాణాలు కాపాడారు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌ గ్రామానికి చెందిన సత్యనారాయణచారి(86), భార్య గోవిందమ్మ(81) దంపతులకు ఒకే కూతురు రేణుక ఉంది. ఆమె భర్తతో కలిసి బెంగళూరులో ఉండేది. తరచూ తల్లిదండ్రులను చూసుకోవడానికి గ్రామానికి వస్తుండడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొన్నిరోజులుగా రేణు క తల్లిదండ్రుల వద్దనే ఉంటూ బాగోగులు చూసుకుంటోంది. తమ కారణంగానే కూతురు, అల్లుడి మధ్య మనస్పర్థలు వచ్చాయని, తాము లేకపోతే వాళ్లు కలిసి ఉంటారని భావించిన సత్యానారాయణచారి దంపతులు కూతురుకు చెప్పకుండా ఆదివారం ఇంటి నుంచి బయల్దేరి సోమవారం ఉదయం బాసరకు చేరారు. కుమార్తెను మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంట పాయిజన్‌ తెచ్చుకున్నారు.

లొకేషన్‌ ఆధారంగా పట్టుకున్న పోలీసులు..

తల్లిదండ్రులు కనిపించకపోవడంతో రేణుకు చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యనారాయణచారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆచూకీ గుర్తించారు. భైంసా ఏఎస్పీకి సమాచారం ఇచ్చారు. దంపతులు బాసరలోని టీటీడీ వసతి గదుల్లోని 122 నంబర్‌ గదిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను పంపించారు. ఉదయం ఆత్మహత్య కోసం వారు ముందే కొనుగోలు చేసి బ్యాగులో దాచుకున్న పాయిజన్‌ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో వృద్ధ దంపతులకు కౌన్సెలింగ్‌ అనంతరం కుమార్తెకు అప్పగించారు. ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు, ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement