నర్సింగ్‌ ఆఫీసర్‌పై పడ్డ చెట్టుకొమ్మ | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ ఆఫీసర్‌పై పడ్డ చెట్టుకొమ్మ

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

● గాయాలతో రిమ్స్‌లో చికిత్స

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌లో పనిచేస్తున్న నర్సింగ్‌ ఆఫీసర్‌పై చెట్టు కొమ్మ పడడంతో సోమవారం గాయాలపాలైంది. తలతో పాటు వెన్నుపూస భాగంలో దెబ్బలు తగిలాయి. రిమ్స్‌లో సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా చెట్లకొమ్మలు తొలగిస్తున్నారు. ఈక్రమంలో ఉదయం స్కూటీపై సిమ్మి కుమారి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే సిబ్బంది ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సిటీ స్కాన్‌, తదితర వైద్య పరీక్షలు చేయించారు. ఇదిలా ఉండగా, రిమ్స్‌ క్యాంపస్‌లో ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ చెట్ల కొమ్మలు తొలగించే సమయంలో ఎలాంటి భద్రత చర్యలు, హెచ్చరిక బోర్డులు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది పేర్కొన్నారు. ఆమె భర్త టూటౌన్‌లో కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement