చెట్టెక్కి ఒకరు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

చెట్టెక్కి ఒకరు ఆత్మహత్యాయత్నం

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

● కాపాడిన కానిస్టేబుల్‌

ఆదిలాబాద్‌రూరల్‌: చెట్టెక్కి ఆత్మహత్యకు యత్నించిన ఒకరిని డయల్‌ 100 కానిస్టేబుల్‌ భుజంగ్‌ స్పందించి ప్రాణాలు కాపాడారు. మావల పీఎస్‌ ఎస్‌హెచ్‌వో ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మావల పోలీసుస్టేషన్‌ పరిధి కేఆర్కే కాలనీకి చెందిన ఒక వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది గురై చెట్టుకు తాడు కట్టుకుని సోమవారం ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డయల్‌ 100కు సమాచారం అందింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ భుజంగ్‌ వెంటనే స్పందించి ఘటనస్థలానికి చేరుకున్నాడు. చెట్టెక్కి తాడును తొలగించి బాధితుడిని కిందకు దించాడు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కానిస్టేబుల్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement