భైంసారూరల్: మండలంలోని మాంజ్రి గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన కిరణ్ (19) బైక్పై మాంజ్రి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


