భైంసాటౌన్: పట్టణంలోని ఖేలో ఇండియా వుషూ కేంద్రం క్రీడాకారులు ఇద్దరు జాతీయస్థాయి వుషూ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 24, 25 తేదీల్లో మంచిర్యాలలో అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఖేలో ఇండియా వుషూ సెంటర్ నుంచి ముగ్గురు క్రీడాకారులు పాల్గొన్నారు. మృణాళిని, జ్ఞానతేజ బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారని కోచ్ శ్రీరాముల సాయికృష్ణ తెలిపారు. డిసెంబర్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో జరిగే 35వ జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని వెల్లడించారు. ఈనెల 28 నుంచి నవంబర్ 2 వరకు చైన్నెలో జరిగే 25వ జాతీయస్థాయి వుషూ పోటీల్లో జిల్లా ఖేలో ఇండియా క్రీడాకారులు గోర అనన్య, నార్వాడే ఆయుష్, సల్ల రామ్‌చరణ్ పాల్గొంటున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడలశాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మార్షల్ ఆర్ట్స్ అధ్యక్షుడు తేజేందర్‌సింగ్ భాటియా అభినందించారు.
జాతీయస్థాయికి ఎంపికై న మృణాళిని, జ్ఞానతేజ


