ఏడు సెక్టార్లుగా బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ఏడు సెక్టార్లుగా బందోబస్తు

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

● ఎస్పీ నితిక పంత్‌

కెరమెరి: భీం వర్ధంతికి పరిసర ప్రాంతాలను ఏడు సెక్టార్లుగా విభజించి 600 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని స్టార్‌ ఫంక్షన హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, ప్రజల రాకపోకలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement