ప్రాణాలు కాపాడే వైద్యవృత్తి గొప్పది | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాపాడే వైద్యవృత్తి గొప్పది

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌: అన్ని వృత్తుల్లో ప్రజల ప్రాణా లు కాపాడే వైద్యవృత్తి ఎంతో గొప్పదని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో శనివారం ఫస్టియర్‌ విద్యార్థులకు నిర్వహించిన వైట్‌కోట్‌ కా ర్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యం అంటే కేవలం మందులు, చికిత్స మాత్రమే కాదని, రోగికి తగిన భరోసా ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌లో ఉత్తమ ప్రతిభ చూపి ఎంబీబీఎస్‌ సీటు సాధించడం గొప్ప విషయమన్నా రు. తన తండ్రి కూడా వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ఆ యన చేసిన సేవలు, రోగుల పట్ల చూపిన ఓర్పును ఆయన మరణం తర్వాత కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. ఒక వైద్యుడి మాటలు, స్పర్శ, ప్రవర్తన కూడా ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వెంకట్‌, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

రేపు ప్రజావాణి రద్దు, విద్యాసంస్థలకు సెలవు

ఆసిఫాబాద్‌అర్బన్‌/ఆసిఫాబాద్‌రూరల్‌: కుమురంభీం 86వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 26న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. దరఖాస్తుదారులు మీసేతు యాప్‌ ద్వారా దరఖాస్తులు అందించవచ్చని సూచించారు. అలాగే జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 26న సెలవుకు బదులుగా నవంబర్‌ 14న అన్ని పాఠశాలలు పనిదినంగా పాటించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement