ఆసిఫాబాద్ క్రైం: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ నిధులు రూ.18.70 కోట్లతో చేపట్ట నున్న అభివృద్ధి పనుల టెండర్లలో అక్రమాలు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు, పర్సంటేజీల పంపకాల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని శనివారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్‌కుమా ర్ కాగజ్‌నగర్‌లో సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరిని కలిసి వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి టెండర్లు దాఖలు చేసి పర్సంటేజీల రూపంలో లబ్ధి పొందేందుకు ప్ర యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అన్ని ప నులకు సంబంధించిన టెండర్ల నోటిఫికేషన్లు, బి డ్డింగ్ వివరాలు, అర్హతలు, అంచనా వ్యయాలు, సాంకేతిక అనుమతులు, వర్క్ ఆర్డర్లను పరిశీలించా లని, అక్రమాలు రుజువైతే తక్షణమే టెండర్లను ర ద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు, మధ్యవర్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ నివేదికను బ హిర్గతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాదారపు శ్రీనివాస్‌రావు, బోర్కు ట్ రాజేందర్, కోట శ్రీనివాస్ పాల్గొన్నారు.


