పోరుగడ్డపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

పోరుగడ్డపై పట్టింపేది?

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

అసంపూర్తిగా జోడేఘాట్‌ రోడ్డు నిర్మాణం అటవీ అనుమతులు లేక నిలిచిన పనులు నామరూపాలు లేకుండా పోయిన ఔషధ మొక్కలు భీం వర్ధంతి నేపథ్యంలో తాత్కాల్కిక ఏర్పాట్లు

ఇక్కడ కనిపిస్తున్న కల్వర్టు జోడేఘాట్‌కు వెళ్లే దారిలో బాబేఝరి, శివగూడ గ్రామా ల మధ్య ఉంది. ఈ నెల 26న కుమురం భీం వర్ధంతి నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా మట్టితో రోడ్డు పక్కన గుంతలు పూడ్చా రు. ఒక్క వర్షం కురిసినా మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి ప్ర మాదకర కల్వర్టులు ఈ దారిలో ఐదు ఉన్నా యి. ప్రస్తుతం అధికారులు వీటికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.

కెరమెరి: జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన ఆదివాసీ వీరుడు కుమురం భీం పోరుగడ్డ కెరమెరి మండలం జోడేఘాట్‌ గ్రామంపై అధికారుల పట్టింపు కరువైంది. ఏటా భీం వర్ధంతి సందర్భంగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తుండగా, శాశ్వత రహదారి సౌకర్యంపై దృష్టి సారించడం లేదు. హట్టి నుంచి టోకెన్‌ మోవాడ్‌ వరకు రోడ్డు నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతి లేకపోవడంతో గతంలోనే నిలిచిపోయింది. అప్పటి నుంచి మొక్కుబడిగా మరమ్మతులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తరచూ అధికారులు, ప్రజాప్రతినిధులు జోడేఘాట్‌కు వచ్చివెళ్తున్నా అర్ధంతరంగా నిలిచిన పనుల పునరుద్ధరణపై చర్యలు తీసుకోవడం లేదు.

రాకపోకలకు అవస్థలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.ఆరు కోట్లతో హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. జోడేఘాట్‌ నుంచి టోకెన్‌ మోవాడ్‌ వరకు 15 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మించినా టోకెన్‌ మోవాడ్‌ నుంచి హట్టి వరకు అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. రిజర్వు ఫారెస్ట్‌లో అనుమతులు లేవని చెప్పడంతో పనులు నిలిచిపోయాయి. ఆరేళ్లుగా ప్రజలు కంకర తేలిన రోడ్డుపైనే ప్రయాణిస్తున్నారు. అలాగే జోడేఘాట్‌ నుంచి ఆసిఫాబాద్‌ మండలంలోని వావుదాం వరకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది. ఇది పూర్తిగా గుట్టలతో ఉంటుంది. నాలుగు కిలోమీటర్ల దూరానికి రోడ్డు వేయాలని ప్రజలు వేడుకుంటున్నారు. వావుదాం నుంచి ఆసిఫాబాద్‌ 8 కిలోమీటర్లు ఉంటుంది. జోడేఘాట్‌ ప్రజలు జిల్లా కేంద్రానికి చేరాలంటే కేవలం 12 కిలోమీటర్ల ప్రయాణమే అవుతుంది. ప్రస్తుతం కెరమెరి నుంచి ఆసిఫాబాద్‌ చేరాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. జిల్లా కేంద్రానికి చేరే మార్గానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

రోడ్డు నిర్మించాలి

హట్టి నుంచి టోకెన్‌ మోవాడ్‌ వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. భీం వర్ధంతి వస్తుందంటే గుంతల్లో మట్టి పోసి కప్పివేస్తున్నారు. నాలుగు రోజులు గడవక ముందే పరిస్థితి మొదటికి వస్తోంది. మళ్లీ వర్ధంతి వరకు పట్టించుకోవడం లేదు. అటవీ అనుమతుల సమస్య పరిష్కరించి కొత్త రోడ్డు నిర్మించాలి.

– పెందోర్‌ రాజేశ్వర్‌,

కుమురం భీం ఉత్సవ కమిటీ చైర్మన్‌

నిలిచిన సుందరీకరణ

జోడేఘాట్‌లో సుందరీకరణ పనులు నిలిచి పోయాయి. వనమూలికలను అందుబాటులో తేవడం కోసం 2017లో 29 వేల మొక్కలు నాటగా, తొలి ఏడాదిలోనే చాలా రకాలు నిర్జీవమయ్యాయి. ప్రత్యేకంగా మనిషి ఆకా రంలో సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటి ప క్కనే లోటస్‌ పాండ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తు తం ఇవి ఆనవాళ్లు కోల్పోయాయి. మ్యూజి యం పక్కన నాటిన మొక్కలు కనీసం వెయ్యి కూడా బతకలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement