జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు ఆర్టీసీకి సమకూరిన పండుగ ఆదాయం కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్లు
పండుగ సమయంలో సందడిగా ఆసిఫాబాద్ మార్కెట్
ఆసిఫాబాద్: బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలోని మార్కెట్లు, దుకా ణాలు కళకళలాడాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగ ర్ మున్సిపాలిటీలతోపాటు మండల కేంద్రాల్లో ని గ్రామీణ సంతలు, షాపుల్లో అమ్మకాలు జోరుగా సాగాయి. పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు సాగగా, ఆర్టీసీకి సైతం పండుగ ఆదాయం భారీగా సమకూరింది. కిరాణాలు, పండ్లు, పూల దుకాణాలతోపాటు మాంసం దుకాణాలు కూడా కిటకిట లాడాయి. పండుగ నేపథ్యంలో ప్రజలు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం విశేషం.
ఆర్టీసీకి ‘స్పెషల్’ బొనంజా
బతుకమ్మ, దసరా నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు నడిపింది. సెలవులు ప్రా రంభమవడంతో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న జిల్లాకు చెందిన వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఉ ద్యోగులు, కళాశాల విద్యార్థులు, ప్రజలు సొంతూళ్లకు తరలివచ్చారు. గత నెల 25 నుంచి ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బ స్సులు ఏర్పాటు చేశారు. అలాగే కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, మహారాష్ట్రకు చెంది న ప్రయాణికుల తాకిడి సైతం అధికంగా ఉంది. సాధారణంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డి పోకు ప్రతిరోజూ సగటు రూ.16 లక్షల ఆదా యం సమకూరుతుండగా, దసరాను పురస్కరించుకుని అదనపు ఆదాయం వచ్చింది. సీజన్ సందర్భంగా ఈ నెల 16 నుంచి 21 వరకు 92.05 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తెలిపారు.
రూ.6కోట్ల మద్యం..
దసరా పండగ పురస్కరించుకుని జిల్లాలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. మూడు రోజుల్లో రూ.6.25 ఓట్ల విలువైన మద్యం తాగారు. డిమాండ్‌ను ముందుగానే ఊహించిన వైన్స్ యజమానులు ముందుగానే భారీ స్టాక్ అందుబాటులో ఉంచారు. ఈ నెల 14 నుంచి 21 వరకు జిల్లాలోని 32 మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యంతోపాటు షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 100కు పైగా మాసం దుకాణాల్లో సుమారు రూ.1.5కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.


