నీళ్లు రావు.. రక్షణ లేదు! | - | Sakshi
Sakshi News home page

నీళ్లు రావు.. రక్షణ లేదు!

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

కాగజ్‌నగర్‌ డబూల్‌ బెడ్రూం ఇళ్లకు నిలిచిన నీటి సరఫరా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం అధికారులు స్పందించాలని లబ్ధిదారుల వేడుకోలు

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని చారి గాంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు వచ్చిందని సంతోషపడే లోపే తాగునీటి సరఫరా లేక నరకం చూస్తున్నారు. నల్లాలు ఉన్నా నీళ్లు రావడంలేదని ల బ్ధిదారులు గురువారం ఆందోళన చేశారు. మున్సి పాలిటీ పరిధిలోని చారిగాంలో ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఆరు నెలల క్రి తం పంపిణీ చేసింది. కానీ మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 15 రోజులుగా తాగునీటి సరఫరా బొట్టుబొట్టుగా వస్తుండడంతో పడరా ని పాట్లు పడుతున్నారు. తాగడానికి, వంటకు, బట్ట లు ఉతకడానికి సరిపడా నీళ్లులేక సమీపంలోని ఒర్రెలకు వెళ్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలు..

డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ప్రస్తుతం ఎలాంటి రక్షణ లే దు. పట్టణంలో ప్రధాన మార్కెట్‌ ఏరియాలో బిల్డింగ్‌లు ఉన్న కొందరు వ్యాపారులకు కూడా ఇళ్లు కేటాయించడంలో వారు ఎవరూ ప్రస్తుతం ఇక్కడ ఉండటం లేదు. ప్రస్తుతం అవి ఖాళీగా ఉంటున్నాయి. దీంతో రాత్రిపూట తమ బంధువుల బెడ్రూం అంటూ ఎవరెవరో వస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని ఖాళీ స్థలంలో రాత్రి 9 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి మద్యం, గంజాయి తాగుతున్నారు. అర్ధరాత్రి దాటే వరకు ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement