హక్కుల కోసం భీం, కొండు పోరాటం | - | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం భీం, కొండు పోరాటం

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రజల హక్కుల కోసం ఆదివా సీ వీరులు కుమురంభీం, ఎడ్ల కొండు అలుపెరగని పోరాటం చేశారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. కుమురంభీం స్వస్థలం ఆసిఫాబాద్‌ మండలం పాత రౌటసంకెపల్లిలో గురువారం భీం జయంతితోపాటు అతడి సహచరుడు ఎడ్ల కొండు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. డీటీడీవో అంబాజీ, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, ఆదివాసీ సంఘం నాయకులతో కలిసి నివాళులర్పించారు. డీసీ సీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధన కోసం భీం ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆదివాసీ గిరిజన వీరులను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో ఉన్నతస్థానంలో నిలబడాలన్నారు. భీం పుట్టిన గ్రామం రౌట సంకెపల్లి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డీటీడీవో మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎడ్ల కొండు వారసులు బక్కయ్య, సర్పంచ్‌ కొండు, గంగారాం, ఆదివాసీ సంఘాల నాయకులు ఆత్రం రఘు, రాజ్‌కుమార్‌, సీతారాం, రత్నమాల, సోను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement