కాగజ్నగర్టౌన్: ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో నిలిపిన లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ హాస్పిటల్ రైలుకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 16 నుంచి 21 వరకు 2,800 మంది రోగులకు ఉచిత వైద్య సేవలు పొందారని లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులు రీటా పి.టౌరో వెల్లడించారు. ఆరు రోజుల్లో కంటి వైద్యం కోసం 2,800 మందిని పరీక్షించామన్నారు. ఇందులో కంటి శుక్లాల ఉన్న 310 మందికి క్యాటరాక్ట్ విత్ ఐవోఎల్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు చేశారు. 700 మందికి వెంటనే రీడింగ్ గ్లాస్లు పంపిణీ చేశారు. 1400 మందికి దూరపు చూపు కళ్లద్దాల కోసం ఆర్డర్ చేయగా, 700 మందికి ఉచితంగా మందులు అందించారు. ఆర్డర్ తీసుకున్న వారికి జూన్ 1, 2న అద్దాలను పంపిణీ చేయనున్నారు.


