వైభవోపేతం.. ఉత్సాహభరితం | - | Sakshi
Sakshi News home page

వైభవోపేతం.. ఉత్సాహభరితం

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. శమీ పూజలతోపాటు రావణ దహన కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని షిర్డీసాయి మందిర్‌, కేస్లాపూర్‌ హనుమాన్‌ మందిర్‌ ఆవరణలో వాహన పూజలు నిర్వహించా రు. మార్కండేయ ఆలయం, కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయం, సాయిమందిర్‌, కేశవనాథ ఆలయం వద్ద శమీపూజ చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, కమిటీ ప్రతినిధులు లక్కీడిప్‌ ద్వారా శ్రీరామ చంద్రుడిగా ఎంపికై న తాటిపెల్లి వినాయక్‌ను శాలువా, పూలదండలతో సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రావణాసురుడి దిష్టిబొమ్మను ఆయన చేతుల మీదుగా దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెడును జయిస్తూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సీఐ నీలం రవి ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. అలాగే కాగజ్‌నగర్‌ పట్టణంలోని త్రిశూల్‌ పహాడ్‌పై ఉన్న శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయంలో దుర్గాదేవిని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు దంపతులు, ఎమ్మెల్సీ దండె విఠల్‌ దర్శించుకున్నారు. అనంతరం సమీపంలోని శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణాసురుడి ప్రతిమకు ఎస్పీ నితిక పంత్‌ నిప్పంటించారు. ఆయా కార్యక్రమాల్లో కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె సాయి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, బాలకృష్ణ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ గంధం శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

– ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌టౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement