రూ.18.70 కోట్ల యూఐడీఎఫ్ నిధులపై కన్ను ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికార యంత్రాంగం పనుల నాణ్యతపై అనుమానాలు
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నూతన కౌన్సిల్ ఏర్పడ్డాక విడుదలైన రూ.18.70 కోట్ల యూఐడీఎఫ్ నిధులే లక్ష్యంగా కమీషన్ల దందా కలకలం రేపుతోంది. పట్టణంలో 30 వార్డులు ఉండగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు కాంట్రాక్టర్లు, పాలకవర్గం జేబుల్లోకి వెళ్తున్న తీరు ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఎనిమిది ప్యాకేజీలుగా చేసి టెండర్లు పిలవగా, మూడు ప్యాకేజీల టెక్నిక ల్ రీజన్లతో రద్దయ్యాయి. మిగిలిన పనులకు కా ంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారనే ఆరోపణలు ఉ న్నాయి. రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి సంజీవ య్య కాలనీ వరకు రూ.4 కోట్ల సీసీరోడ్డు పనికి మాత్రమే పోటీ ఉంది. ఆ పని ఒక్కటే ఏడు శా తం లెస్‌తో కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. మిగి లిన ఏడు ప్యాకేజీలు నామమాత్రపు లెస్‌తో అందరూ కలిసి పంచుకున్నట్లు బహిరంగంగానే చ ర్చించుకుంటున్నారు. సింగిల్ టెండర్ అయితే ర ద్దవుతుందని ఇద్దరు, ముగ్గురు కలిసి తక్కువ లె స్‌తో వేసి పనులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
60:40 ఫార్ములా
కాగజ్‌నగర్‌లో ఇప్పుడు 60:40 ఫార్ములా హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం పనుల విలువలో తొమ్మిది శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్లపై పాలకవర్గంలోని కీలక నేతలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అందులో 60శాతం పనులు మొదలు పెట్టకముందే, మిగిలినవి 40 శాతం పనులు పూర్తయ్యాక ఇవ్వాలని ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు ప్యాకేజీలకు సంబంధించిన 60శాతం కమీషన్ డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.
వారు ఎదురుతిరగడంతో..!
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొందరు కౌన్సిలర్లకు నాలుగు రోజుల క్రితమే రూ.35 వేల చొప్పున పంచినట్లు సమాచారం. అయితే ఆరేడుగురు కౌన్సిలర్లు ఎదురుతిరగడంతో వ్యవహారం బహిర్గతమైనట్లు సమాచారం. ‘మొత్తం ఎంత వసూలు చేశారు.. లెక్క చెప్పండి’ అని వారు నిలదీసినట్లు తెలిసింది. ‘లెక్కతేలే వరకు మేము డబ్బులు ముట్టుకోం’ అని తేల్చిచెప్పడంతో కమీషన్ల పంపకంలో పంచాయితీ మొదలైంది. మరోవైపు పనులు మొదలు కాకముందే 9 శాతం కమీషన్ పోతే ఇక పనుల నాణ్యత ఏం ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీసీ రోడ్డు, డ్రెయినేజీల్లో సిమెంట్, స్టీల్ తగ్గించి నాసిరకం పనులు చేస్తారనే భావన వ్యక్తమవుతోంది. కమీషన్ వ్యవహరంపై అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై మున్సిపల్ డీఈ రమాదేవిని ‘సాక్షి’ వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.


