పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

● ఎస్పీ నితిక పంత్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌ క్వార్టర్‌లో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు దేశంలో విధి నిర్వహణలో మరణించి 154 మంది పోలీసుల పేర్లను డీఎస్పీ అశోక్‌ చదివి వినిపించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వీరమరణానికి గుర్తుగా ఏటా అక్టోబర్‌ 21న ‘పోలీసు అమరవీరుల సంస్మరణ’ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1985 నుంచి ఇప్పటివరకు 14 మంది పోలీసులు సమాజం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని పేర్కొన్నారు. అమరవీరుల సేవలను మరోసారి స్మరించుకోవడంతోపాటు, వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు. గురువారం నుంచి జిల్లాలో ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌, వీడియోగ్రఫీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌, సీఐలు, ఏఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement